Ticker

6/recent/ticker-posts

Ad Code

TSRTC లో అప్రెంటిస్‌ పోస్టులకు Notification విడుదల..


హైదరాబాద్‌ జనవరి 21 (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిపోల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌ఆర్టీసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అప్రెంటిస్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ వంటి ఆనన్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా నాన్‌ ఇంజనీరింగ్‌ అప్రెంటిస్‌ పోస్టుల్లో 150 ఖాళీగా ఉన్నాయని టీఎస్‌ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21`30 ఏండ్ల మధ్య వయసు ఉండాలి. ట్రైనింగ్‌ పీరియడ్‌ మూడేండ్లు ఉంటుంది. మొదటి సంవత్సరం నెలకు రూ.15వేలు, రెండో సంవత్సరంలో నెలకు రూ.16వేలు, మూడో సంవత్సరంలో నెలకు 17వేలు స్టైఫండ్‌ అందించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://tsrtc.telangana.gov.in/recruitmentsnew.php  సంప్రదించవచ్చు.

రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు..

హైదరాబాద్‌ రీజియన్‌ - 26,

సికింద్రాబాద్‌ రీజియన్‌ - 18,

మహబూబ్‌నగర్‌ - 14,

మెదక్‌  - 12,

నల్గొండ  -12,

రంగారెడ్డి - 12,

ఆదిలాబాద్‌ -  09,

కరీంనగర్‌ - 15,

ఖమ్మం - 09,

నిజామాబాద్‌ - 09,

వరంగల్‌ - 14

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు