Ticker

6/recent/ticker-posts

Ad Code

అడ్డదిడ్డం ప్రయాణం - అడ్డొచ్చిన వాణ్ని తిట్టడం - Old City లో ట్రాఫిక్ తిప్పలు !


చార్మినార్, జనవరి 21 (ఇయ్యాల తెలంగాణ) : అడ్డ దిడ్డం రావడం, ఎదురుగా వచ్చే వాణ్ని బెదిరంచడం, రాంగ్ రూట్లలో ప్రయాణించడం, ఎదుటి వ్యక్తిని తిట్టడం, కార్లను కొట్టడం,అదే మని అడిగితే, దౌర్జన్యానికి దిగడం ఇదీ ఓల్డ్ సిటీలో నిత్యం కనిపించే ట్రాఫిక్ అవస్థల తీరు.  రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలను ఆపడం ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం సుదూర ప్రాంతాల వరకు వాహనాలు నిలిచి పోయినా ?  ఈసెంత కూడా భయం లేక పోవడం అడ్డంగా ఎందుకు పెట్టావంటే ఎదురు తిరగడం గుమిగూడి జనాలను కొట్టడం ? చేసేదే తప్పు పైగా దబాయింపు ఏమిటీ చిత్ర విచిత్రమైన పరిస్థితులు అని ప్రయాణికులు కిమ్ అనకుండా నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ట్రాప్ఫిక్ నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా దౌర్జన్యానికి తెగబడుతున్న తంతు పాతబస్తీలో నిత్య కృత్యంగా మారింది. 


కనీసం మాటు మాట్లాడలేని పరిస్థితులు నెలకొన్నాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. కనీసం పోలీసులకు భయపడక పోవడం ట్రాఫిక్ నిభందనలు పాటించక పోవడం నానా యాతన పడుతూ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. సిటీ అంతా ప్రయాణించడం ఒక ఎత్తైతే ఓల్డ్ సిటీ లో ప్రయాణం చాలా తిప్పలు పెడుతున్నదని ప్రయాణికులు మొత్తుకుంటున్నారు. కొందరు చేస్తున్న దుశ్చర్యల వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, కనీస ట్రాఫిక్ నిబంధనలు కూడా పాటించక పోవడం వల్లే అనేక రకాల ట్రాఫిక్ తిప్పలు ఎదుర్కోవాల్సి వస్తున్నదని ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్లపైకి రావాలంటేనే భయం భయంగా తలపిస్తున్నట్లు  భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. 

దీనికి తోడు ఆటోవాలాలు తోపుడు బండ్ల వ్యాపారాలు కూడా ఇష్టం వచ్చిన రీతిలో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ తమ ఆటోలు, తోపుడు బండ్లను పెట్టడం తో కూడా ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. రాంగ్ రూట్లలో వచ్చి డాష్ ఇచ్చి కూడా ఉల్టా దబాయిస్తున్నారంటే వీళ్ళు ఎంతగా తెగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కనీసం కొంచం కూడా సమాజం గురుంచి ఆలోచన లేకుండా చేయడం ఇలాంటి వారి వల్లే సభ్య సమాజం తల దించుకొనేలా చేయడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి వారిని ప్రోత్సహించడం కూడా ఒక దుశ్చర్యనే తప్ప వారికేదో మేలు చేస్తున్నామని అనుకోవడం అతి పెద్ద పొరపాటే అవుతుంది. ప్రభుత్వ నిభందనలు తుంగలో తొక్కి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన నియమ నిభందనలు పాటించక పోవడం కూడా సమాజంలో అతి పెద్ద నేరంగానే పరిగణించ బడవుతుంది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కాస్త దృష్టి కేంద్రీకరించి పాతబస్తీలో ట్రాఫిక్ తిప్పలు తప్పడానికి సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తే అత్యంత మేలు చేకూరుతున్నదని ప్రయాణికులు కోరుతున్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు