Ticker

6/recent/ticker-posts

Ad Code

పదవతరగతి పరీక్షల్లో School టాపర్లుగా నిలిచిన సుల్తాన్ షాహి స్కూల్ విద్యార్థులు


హైదరాబాద్, మే 5 (ఇయ్యాల తెలంగాణ) పాతనగరంలోని  ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో స్కూల్ టాపర్లుగా నిలిచారు. చార్మినార్ మండల పరిధిలోని సుల్తాన్ షాహి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. పాఠశాల స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి స్కూల్ టాపర్లుగా నిలిచారు. పాఠశాల మొత్తంలో 31 మంది విద్యార్థులు పరీక్ష రాయగా  23 మంది విద్యార్థులు ఉత్తీ ర్ణులయ్యారు. ఇందులో 7 మంది విద్యార్థులు స్కూల్ టాపర్లయ్యారు. 

స్కూల్ టాపర్లు గా నిలిచిన విద్యార్థులు : 

1. గౌరీ - మార్కులు - 536

2. కార్తీక్ చారి - మార్కులు - 485

3. వందనా - మార్కులు - 451

4. రోహిత్ - మార్కులు - 439

5. ఉదయ్ - మార్కులు  - 439

6. అనిత  - మార్కులు  - 420

7. చందు -- మార్కులు - 412 

పాఠశాల మొత్తంలో పరీక్ష రాసిన విద్యార్థులను గమనిస్తే మొత్తం 74 శాతం విద్యార్థులు ఉత్తిర్ణత సాధించారు. విద్యార్థులు సాధించిన అద్భుత ఫలితాలకు గాను పాఠశాల ప్రధానోపాధ్యాయులు  పి వి నర్సరాజు, జిల్లా సైన్స్ అధికారి సీ.  ధర్మేందర్ రావ్   ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు . 

భవిష్యత్తులో ఉన్నత చదువులో సైతం ఇదే స్ఫూర్తి కనబరుస్తూ, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు