Ticker

6/recent/ticker-posts

Ad Code

BRS ప్రభుత్వ హయాంలో కొంతమందికి ఇష్టారాజ్యంగా పదోన్నతులు

 


షబ్బీర్‌ అలీకి అభినందనలు తెలిపిన
తెలంగాణ మున్సిపల్‌ ఉద్యోగ సంఘం

హైదరాబాద్‌ జనవరి 22 (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియమితులైన షబ్బీర్‌ అలీని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో తెలంగాణ మున్సిపల్‌ ఉద్యోగ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్‌.తాజ్మాహన్‌ రెడ్డి నాయకత్వంలో పలు సంఘాల నేతలు కలిసి ఆయన్ను సత్కరించి శుబాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా తాజ్మాహన్‌ రెడ్డి మాట్లాడుతూ  భారాస హయాంలో కొంతమందికి ఇష్టారాజ్యంగా పదోన్నతులు కల్పించి అనేక మందికి అన్యాయం చేశారని ఆరోపించారు.. ఈ సందర్భంగా గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కొనసాగిన వివక్షతను  వారు షబ్బీర్‌ అలీకి  వివరించారు. వల్లబనగర్‌ (అల్వాల్‌) సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం రిజిస్ట్రార్‌ తిరిగి ముజీబ్‌ నియమించడంపై ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నట్లు తాజ్మాహన్రెడ్డి తెలిపారు. ఎన్నికల కాలంలో బదిలీ చేసిన అధికారికి తిరిగి వల్లబ్‌ నగర్లోనే బాధ్యతలు కేటాయించడం సరికాదన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు