Ticker

6/recent/ticker-posts

Ad Code

Ayodhya లో కొలువుదీరిన రామ్‌లల్లా..


👉 మధ్యాహ్నం 12.29 నిమిషాలకు ముఖ్య ప్రాణ ప్రతిష్ట

👉 ప్రాణప్రతిష్ట చేసిన మోదీ

👉 రామ నామంతో మారుమోగిన అయోధ్య 

👉 జైజైరాం రాజారాం.. అంటూ తన్మయత్వంలో తేలిపోయిన  రామభక్తులు

అయోధ్య,  జనవరి 22 (ఇయ్యాల తెలంగాణ) :   కౌసల్య రాముడు.. అయోధ్యలో కొలువుదీరాడు. బాలరాముడి విగ్రహాన్ని కొత్తగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్టించారు. ప్రధాని మోదీ చేతుల విూదుగా ప్రాణ ప్రతిష్ట జరిగింది. భారత కాలమానం ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం 12.29 నిమిషాలకు ముఖ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్మించారు. సుమారు 84 సెకన్ల పాటు అసలు క్రతువును నిర్వహించారు. కీలకమైన ఈ 84 సెకన్ల సమయంలోనే రాముడి మూర్తికి ప్రాణ ప్రతిష్ట చేశారు. రాముడి విగ్రహం కండ్లకు ఉన్న వస్త్రాన్ని ప్రధాని తొలగించారు. ఆ తర్వాత పుష్పాలతో రామున్ని పూజించారు. ప్రాణ ప్రతిష్ట సమయంలో 50 శంఖాలు ఊదారు. రామ నామంతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. జైజైరాం రాజారాం.. జైజైరాం రాజారాం.. అంటూ రామభక్తులు తన్మయత్వంలో తేలిపోయారు. గర్భిగుడి పూజలు ప్రధాని మోదీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు.


శ్రీ రామ జన్మభూమి రామమందిరంలో ఇవాళ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఉదయం రామ్‌ లల్లాను మంత్రోచ్ఛరణతో నిద్ర లేపారు. వైదిక మంత్రాలు మంగళా సాసనం పాడారు. ఉదయం 10 గంటల నుంచి ప్రాణప్రతిష్టకు చెందిన పూజలు ప్రారంభం అయ్యాయి. ఒకవైపు గర్భగుడిలో బాలరాముడి మూర్తికి పూజలు.. మరో వైపు యజ్ఞశాలలో హవనం సాగింది. ప్రాణ ప్రతిష్ట రత్వాత శుక్ల యజుర్వేదంకు చెందిన హోమం, పారాయణం జరగనున్నది. ఆ తర్వాత సాయంత్రం పూర్ణాహుతి ఉంటుంది.రఘుపతి రాఘవ రాజారాం.. పతీత పావన సీతారం గానం మారుమోగింది. పీతాంబర వస్త్రాల్లో బాలరాముడు మనోహరంగా దర్శనమిస్తున్నాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు