Ticker

6/recent/ticker-posts

Ad Code

CBSE కీలక నిర్ణయం?

న్యూఢల్లీ, జూలై 22, (ఇయ్యాల తెలంగాణ ):ఇకపై ప్రాంతీయ భాషలో బోధన మానవుని జీవితంలో విద్య ఎంతో ప్రదానమైంది. విద్యతోనే మానిషి జీవితంలో ఎదగ గలడు. చదువుకోవాలంటే ఇంగ్లీష్‌ విూడియం స్కూల్స్‌ కోసం చూస్తుంటారు.. తమ పిల్లలను ఇంగ్లీష్‌ విూడియంలోనే వేయాలని చూస్తారు. అలా మంచి పేరున్న ఇంగ్లీష్‌ విూడియం స్కూల్‌లో చేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఇక సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూల్స్‌ లో సీటు కోసం చూస్తుంటారు. అయితే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ వాటిల్లో కేవలం ఇంగ్లీష్‌ విూడియంలోనే విద్య కొనసాగుతుంటుంది. తమ మాతృభాషలో విద్యను కొనసాగించలేకపోతారు. ఈ నేపథ్యంలో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) బీర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరు తమకు నచ్చిన భాషలో బోధనా మధ్యామాన్ని ఎంచుకొనేలా నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు తమకు నచ్చిన భారతీయ భాషలను బోధనా మాధ్యమంగా ఎంచుకునేందుకు సీబీఎస్‌ఈ పాఠశాలలకు అనుమతించింది.జాతీయ విద్యావిధానం పాలసీని ప్రోత్సహించే విధంగా సీబీఎస్‌ఈ బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు తమకు నచ్చిన భారతీయ భాషలను బోధనా మాధ్యమంగా ఎంచుకునేందుకు సీబీఎస్‌ఈ పాఠశాలలకు అనుమతించింది. ప్రస్తుతం మెజారిటీ సీబీఎస్‌ఈ పాఠశాల్లలో ఆంగ్లంలో బోధిస్తుండగా కొన్ని పాఠశాల్లలో మాత్రమే హిందీలో బోధన సాగుతోంది. ఇప్పటి వరకు సీబీఎస్‌ఈ పాఠశాల్లలో భారతీయ భాషల్లో బోధించేందుకు అనుమతి లేదు. తాజా ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలు తమకు నచ్చిన భారతీయ భాషల్లో బోధనను కొనసాగించవచ్చు. ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(ఙఉఅ) ఉన్నత విద్యలో సైతం మాతృభాషల్లో బోధించేందుకు ఇలాంటి ఉత్తర్వులనే జారీ చేసింది. ఇదొక చరిత్రాత్మక నిర్ణయమని జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే భారతీయ భాషా సమితి అధ్యక్షుడు చాము కృష్ణ శాస్తి అన్నారు. ఈ నిర్ణయంతో బోధన, అభ్యాసరీతులు భారతీయీకరణం చెందడంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అవకాశాలు వస్తాయన్నారు. ప్రస్తుతం వృత్తిపరమైన విద్యలో ప్రాంతీయ భాషలను యూజీసీ అందుబాటులోకి తేగా, ఇప్పుడు పాఠశాల స్థాయిల్లో స్థానిక భాషలను ఐచ్ఛికంగా ఎంచుకునేందుకు సీబీఎస్‌ఈ కూడా ఈ అవకాశం కల్పించిందని అన్నారు. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీని మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఈ నిర్ణయం ఎంతో ముఖ్యపాత్ర వహిస్తుందని శాస్త్రి అన్నారు. ప్రాథమిక పాఠశాలల నుంచి పీయూసీ వరకు అన్ని పాఠశాలల్లో భారతీయ భాషలను బోధనా మాధ్యమంగా ఉపయోగించాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ ఆదేశించింది. ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమైనదని అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. అలాగే జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) లో ఊహించినట్లుగా ఇది పాఠశాలల్లో భారతీయ భాషా ఆధారిత విద్యను ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు.దీనిపై ధర్మేంద్ర ప్రధాన్‌ ట్వీట్‌ చేస్తూ, పాఠశాలల్లో మాతృభాష, భారతీయ భాషలలో విద్యను ప్రోత్సహించే దిశగా ఇది ప్రశంసనీయమైనదని అన్నారు. పాఠశాలలన్నింటిలో ప్రాథమిక నుంచి పన్నెండవ తరగతి వరకు భారతీయ భాషలలో విద్యను అందించే ఎంపికను అందించినందుకు సీబీఎస్‌ఈని నేను అభినందిస్తున్నాను. ఎన్‌ఈపీ ద్వారా ఊహించిన విధంగా ఇది పాఠశాలల్లో భారతీయ భాషా ఆధారిత విద్యను ప్రోత్సహిస్తుంది. విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇది శుభారంభం’ అని ఆయన పేర్కొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు