Ticker

6/recent/ticker-posts

Ad Code

AI కోర్సులకు కేంద్రం శ్రీకారం

 
ముంబై, జూలై 22, (ఇయ్యాల తెలంగాణ ):కేంద్రప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇండియా 2.0 లో భాగంగా ఉచిత ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌`ంఎ కోర్సును ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వనున్నారు. స్కిల్‌ ఇండియా, జీయూవీఐ మధ్య పరస్పర సహకారంతో ఈ కార్యక్రమానికి రూపొందించారు. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ, గుజరాతీ, హిందీతోపాటు ఇంగ్లిష్‌లో ఈ కోర్సును అందుబాటులో తీసుకొచ్చారు. ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత కోర్సును ప్రారంభిస్తారు. ఆన్‌లైన్‌ విధానంలోనే బోధన ఉంటుంది. ఈ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సు ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌(ఎన్‌సీవీఈటీ)’, ఐఐటీ మద్రాస్‌ గుర్తింపు కూడా దక్కించుకుంది. ఐఐటీ మద్రాస్‌, ఐఐఎం అహ్మదాబాద్‌ సంయుక్త ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ ఎడ్‌`టెక్‌ కంపెనీ జీయూవీ.. పర్సనలైజ్డ్‌ లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ విభాగాల్లో అగ్రగామిగా ఉంది. ఈ కంపెనీ వివిధ ప్రాంతీయ భాషల్లో సాంకేతిక నైపుణ్యాలను బోధించడం, ఆన్‌లైన్‌ లెర్నింగ్‌, అప్‌స్కిల్లింగ్‌, రిక్రూట్‌మెంట్‌ అవకాశాల వంటి సేవలను అందిస్తోంది. ముఖ్యంగా ప్రాంతీయ భాషాల్లో టెక్‌ స్కిల్స్‌ బోధించడంలో ముందంజలో ఉంది.గతంలో ప్రోగ్రామింగ్‌ చేయకపోయినా, బేసిక్‌ సింటాక్స్‌ తెలిసినా లేదా పైథాన్‌ అధునాతన ఫీచర్ల గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సులో చేరవచ్చు. ఈ కోర్సు విూకు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, పైథాన్‌ల ఓవర్‌ వ్యూను అందిస్తోంది. ఈ కోర్సు ద్వారా కంపెనీలు కోరుకునే పైథాన్‌ ప్రోగ్రామింగ్‌, ఏఐ నైపుణ్యాలను పొందేందుకు అవకాశం కలుగుతుంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి అత్యాధునిక సాంకేతిక విద్యను ప్రతి ఒక్కరికి అందించడానికి ముఖ్యంగా.. గ్రావిూణ యువతలో సాధికారత కల్పించే లక్ష్యంతో ఏఐ`ఫర్‌`ఇండియా 2.0 కోర్సుకు రూపకల్పన చేశారు. ఈ ఉచిత ఏఐ కోర్సులో ప్రవేశాలు కోరేవారు ఉఙపఎ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుది. సైనప్‌ చేసే సమయంలో విూకు జావా, కోడిరగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఇతర విషయాలపై ఏమైనా అవగాహన ఉందా అని అడుగుతారు. కానీ ఇవేవిూ రాకపోయినా ఏఐ ప్రాగ్రామింగ్‌ నాలెడ్జ్‌ కావాలనుకునే వారు కోర్సు కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.భారతీయ ప్రాంతీయ భాషలలో సాంకేతిక కోర్సులను అందించాల్సిన ఆవశ్యకతను కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నొక్కి చెప్పారు. సాంకేతిక విద్యలో భాషాపరమైన అవరోధాలను ఛేదించడం అత్యంత ముఖ్యమని, ఈ కార్యక్రమం దేశంలోని యువతను, ముఖ్యంగా గ్రావిూణ ప్రాంతాల్లోని భవిష్యత్తుకు కీలకమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. కాగా భవిష్యత్తు మొత్తం ఏఐ దే అని ఇప్పటికే విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ప్రపంచంలోని దిగ్గజ సంస్థలన్నీ ఈ రంగంలో పెట్టుబడులు పెంచుతున్నాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కూడా ఇటీవలే ఏఐ స్టార్టప్‌ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు