Ticker

6/recent/ticker-posts

Ad Code

Telanganaలో 2 రోజుల్లో టెస్త్‌ ఫలితాలు !


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు రెండు లేదా మూడురోజులలో వెలువడనున్నాయి. మార్కుల మెమోలను ఎలా ముద్రించాలన్న అంశానికి ప్రభుత్వం ఎట్టకేలకు తెరదించడంతో.. ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. 2024`25 విద్యాసంవత్సరానికి సంబంధించి పదోతరగతి మార్కుల మెమోలపై మార్కులతోపాటు గ్రేడ్స్‌ను సైతం ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్‌ 8న పాఠశాల విద్యాశాఖ నుంచి ప్రతిపాదన పంపగా.. దాదాపు 20 రోజులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితారాణా ఏప్రిల్‌ 27న ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఈ విద్యాసంవత్సరం నుంచి పదోతరగతిలో గ్రేడిరగ్‌ విధానాన్ని తీసేసినట్లయింది. ఇప్పటివరకు పదోతరగతిలో సబ్జెక్టులవారీగా గ్రేడ్లతోపాటు.. క్యుములేటివ్‌ గ్రేడిరగ్‌ పాయింట్‌ యావరేజ్‌(అఉఖం) ఇచ్చేవారు.  ఇక మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. గ్రేడ్లస్థానంలో మార్కుల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇంటర్నల్స్‌ను రద్దుచేయాలని తీసుకున్న నిర్ణయం ఆలస్యం కావడంతో ఈ ఒక్క ఏడాదికి ఇంటర్నల్స్‌ ఉంటాయని ప్రకటించారు. మెమోలపై మార్కులు ఎలా ముద్రించాలన్న అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ పలు సిఫారసులు చేసింది. దీంతో ఫలితాల విడుదలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. రెండు, మూడు రోజుల్లో ఫలితాలు విడుదల కానున్నాయి.ఇకనుంచి సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇస్తారు. జీపీఏ అనేది ఇవ్వరు. మార్కులమెమోలపై సబ్జెక్టులవారీగా.. రాత పరీక్షలు, అంతర్గత పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరుస్తారు. చివరగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్‌ అయ్యారా? అనేది ఇస్తారు. ఇంకా బోధనేతర కార్యక్రమాల(కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌)లో విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్‌ అండ్‌ లైఫ్‌ ఎడ్యుకేషన్‌, ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ ఎడ్యుకేషన్‌, వర్క్‌ అండ్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌, ఫిజికల్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అనే నాలుగు కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు సంబంధించి గ్రేడ్లు కూడా ముద్రిస్తారు. 

ఫలితాల విడుదలకు తొలగిన అడ్డంకి..

పదో తరగతిలో మార్కుల మెమోలు ఎలా ఉండాలన్న విషయమై ఇప్పుడు స్పష్టత ఇవ్వడంతో ఫలితాల విడుదలకు అడ్డంకి తొలగిపోయింది. రెండు మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇంతవరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిగా ఉన్న ఈవీ నరసింహారెడ్డి బదిలీ అయ్యారు. ఆ స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. కొత్త అధికారి లేకుండా విడుదల వద్దనుకుంటే ఒకట్రెండు రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మెమోల ముద్రణ ఇలా..

👉 పదోతరగతి మెమోలపై ఇంటర్నల్స్‌ మార్కులు, వార్షిక పరీక్షలు మార్కులు ఉంటాయి. మొత్తం మార్కులతో పాస్‌ సర్టిఫికెట్‌ జారీచేస్తారు. గ్రేడ్లు, మార్కులను వేర్వేరుగా ముద్రిస్తారు.

👉 సబ్జెక్టులవారీగా సాధించిన మార్కు లు, గ్రేడ్లు రెండిరటిని సర్టిఫికెట్‌లో ముద్రిస్తారు.

👉 పదోతరగతిలో ఇంటర్నల్స్‌లో 20 మార్కులు కేటాయించారు. ఈ పాఠ్య కార్యక్రమాలకు కూడా గ్రేడ్లు ఇస్తారు. ఎస్సెస్సీ పాస్‌ సర్టిఫికెట్‌లో చూపుతారు.

👉 పదోతరగతి వార్షిక పరీక్షలను ప్రస్తుతం ఒక సబ్జెక్టులో 80 మార్కులకు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో 28 మార్కులొస్తేనే పాసైనట్టు లెక్క. 

👉 ఇంటర్నల్స్‌లో ఎన్ని మార్కులొచ్చినా వార్షిక పరీక్షల్లో 28 మార్కులు సాధించాల్సిందే. హిందీలో 16 మార్కులొస్తే పాస్‌ అయినట్టు.

👉 మెమోలపై ప్రథమశ్రేణి, ద్వితీయశ్రేణి, తృతీయ శ్రేణి అంటూ ఏముండదు. ఎన్ని మార్కులొచ్చినా పాస్‌ అనే ముద్రిస్తారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు