Ticker

6/recent/ticker-posts

Ad Code

ఇళ్ల లబ్దిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ Reiambesment


👉 జిల్లాలో 10,760 మందికి రూ.84.44 లక్షల లబ్ధి

👉 జిల్లా కలెక్టర్‌ డా.మనజిర్‌ జిలాని సమూన్‌

నంద్యాల, జనవరి 18 (ఇయ్యాల తెలంగాణ) : పేద అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తూ వారి స్వంత ఇంటి కలను నిజం చేస్తూ... నవరత్నాలు ` పేదలందరికీ ఇళ్లు కింద జిల్లాలో 10,760 మందికి 84.44 లక్షల రూపాయల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ లబ్ధిని చేకూర్చామని జిల్లా కలెక్టర్‌ డా.మనజిర్‌ జిలాని సమూన్‌ పేర్కొన్నారు.గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి  నవరత్నాలు ` పేదలందరికీ ఇళ్లు కింద 12.77 లక్షల మందికి రూ.4,500.19 కోట్ల బ్యాంకు రుణం అందించి అందులో ఈ దఫా అర్హులైన 4,07,323 మంది లబ్దిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.46.90 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి  జమ చేసే కార్యక్రమాన్ని కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లా కలెక్టర్‌ డా.మనజిర్‌ జిలాని సమూన్‌, హౌసింగ్‌ పిడి వెంకటసుబ్బయ్య, హౌ సింగ్‌ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డా.మనజిర్‌ జిలాని సమూన్‌ మాట్లాడుతూ ‘‘నవరత్నాలు ` పేదలందరికీ ఇళ్లు’’ వడ్డీ రీయింబర్స్మెంట్‌ కింద  84.44 లక్షల రూపాయలను 10,760 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జమచేసారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 37,488 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 132 కోట్ల 7 లక్షల రూపాయల రుణాలు అందించడం జరిగిందన్నారు. అందులో అర్హులైన 10,760 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్‌ కింద 84.44 లక్షల రూపాయలను జమ చేశామన్నారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులు తమ తోటి లబ్ధిదారులకు కూడా అవగాహన కల్పించి సగంలో ఉన్న, మొదలుకాని ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా అవగాహన కల్పించాలన్నారు. 35 వేల రూపాయలు చొప్పున అడ్వాన్స్‌ తీసుకోని వారు కూడా తీసుకునేలా వారికి తెలియజేయాలన్నారు. ప్రభుత్వం అందించిన వడ్డీ రీయింబర్స్మెంట్‌ ని లబ్ధిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.అనంతరం జిల్లా కలెక్టర్‌, హౌసింగ్‌ పి.డి తదితరులు లబ్ధిదారులకు 84.44 లక్షల రూపాయల మెగా చెక్కును పంపిణీ చేసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు