Ticker

6/recent/ticker-posts

Ad Code

ముఖ్యమంత్రికి ఘనస్వాగతం

  

తిరుపతి జులై ,21(ఇయ్యాల తెలంగాణ ):ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం ఉదయం  ఐదవ  విడత  వై.యస్‌.ఆర్‌ నేతన్న నేస్తం రాష్ట్ర స్థాయి కార్యక్రమం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం నుండి కంప్యూటర్‌  బటన్‌ నొక్కి నేరుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్న నేపథ్యంలో ఉదయం 9.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న గౌ. ఆం.ప్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వారికి ఘన స్వాగతం లభించింది.  వీరి వెంట రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి  ఉన్నారు. రాష్ట్ర విద్యుత్‌, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి వర్యులు శ్రీ పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి, రాష్ట్ర క్రీడా సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీలు  సిపాయి సుబ్రమణ్యం,, భరత్‌,  తిరుపతి జిల్లా కలెక్టర్‌ కె వెంకటరమణారెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్‌ హరిత,  స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్‌ శిరీష,  డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌ రెడ్డి, శ్రీకాళహస్తి ఆర్డీవో  రామారావు, డి ఐ జి అమ్మిరెడ్డి, రేణిగుంట, ఏర్పేడు తాసిల్దారులు , తదితరులు గౌ. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.అనంతరం ఉదయం 9.55  గం. లకు వెంకటగిరి బహిరంగ సభలో పాల్గొనుటకు ముఖ్యమంత్రి   హెలికాప్టర్‌ లో బయల్దేరి వెళ్ళారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు