Ticker

6/recent/ticker-posts

Ad Code

న్యూఢిల్లీ Railway స్టేషన్‌ లో తొక్కిసలాట 18 మంది మృతి


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (ఇయ్యాల తెలంగాణ) : కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో శనివారం రాత్రి న్యూఢల్లీి ల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన  తొక్కిసలాటలో 18 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. 14, 15 ప్లాట్ఫాంలపై ఈ దుర్ఘటన జరిగింది. 14వ నంబరు ప్లాట్ఫాంపై ప్రయాగ్రాజ్‌ ఎక్స్ప్రెస్‌ నిలిచి ఉండడంతో మహా కుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడకు చేరుకున్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్‌, భువనేశ్వర్‌ రాజధాని ఎక్స్ప్రెస్‌ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నంబరు ప్లాట్ఫాంలపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసినట్లుసమాచారం.  మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ పది లక్షల నష్టపరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రెండున్నర లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం ప్రకటించారు. ఘటనపై ప్రధాని మోదీగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు