Ticker

6/recent/ticker-posts

Ad Code

శివగాన స్వరాభిషేకం Wall Poster ఆవిష్కరణ


జగిత్యాల, మర్చి 2 (ఇయ్యాల తెలంగాణ) :  ఈ నెల 8 మహాశివరాత్రి నాడు నక్కరాజు నిర్వహించే 24 గంటల నిర్విరామ మహదృఢ సంకల్ప శివ గాన స్వరాభిషేకం వాల్‌ పోస్టర్‌ ను శనివారం థరూర్‌ క్యాంపులోని శ్రీ కోదండ రామలయంలో ఆవిష్కరించారు. మొదట ఆలయంలో నాయకుల  గోత్రణామాధులతో ఆలయ పూజారి అర్చనలు చేయగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం.గాయకుడు నక్క రాజుతో పాటు

ట్రస్మా జిల్లా అధ్యక్షులు బోయిన్‌ పెల్లి శ్రీధర్‌ రావు, జగిత్యాల ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు ఎన్నం కిషన్‌ రెడ్డి, జగిత్యాల వర్థక సంఘం సహాయ కార్యదర్శి బోయిన్‌ పెల్లి ప్రశాంత్‌ రావుల ఆధ్వర్యంలో పోస్టర్‌ ఆవిష్కరించారు.

జగిత్యాల పట్టణం బైపాస్‌ రోడ్డు లోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో మాహా శివరాత్రి

సంధర్బంగా ప్రముఖ గాయకులు,బుగ్గారం వాస్తవ్యులు నక్క రాజు ఈనెల 8న ఉదయం 8 గంటల నుండి మరుసటి రోజు  ఉదయం 8 గంటల వరకు ద్వాదశ వసంతాలలో భాగంగా 6వ సారి మాహాదృడ సంకల్ప శివ గాన

స్వరాభిషేకం కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.


ఈ కార్యక్రమంలో  నంచర్ల సింగిల్‌ విండో చైర్మన్‌ మంత్రి వేణుగోపాల్‌, శరత్‌ రావు,

సీనియర్‌ పాత్రికేయులు సత్యనారాయణ గౌడ్‌, బొడ్డుపెళ్లి అంజయ్య, ఉపాది హావిూ ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షులు గడ్డం రమేష్‌,  రవిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు