Ticker

6/recent/ticker-posts

Ad Code

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు 2 రోజు

 న్యూఢల్లీ, జూలై 21 (ఇయ్యాల తెలంగాణ ):పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు రెండో రోజు కుడా మణిపూర్‌ అంశం ఉబాయ సభల్లో విపక్షాల ఆందోళనకు దిగారు. దీనితో రెండో రోజు కుడా ప్రారంభమైన కాసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మణిపూర్‌ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడటంతో ఎగువ, దిగువ సభలను వాయిదా వేశారు.ఉదయం 11 గంటలకు లోక్‌ సభ ప్రారంభంకాగానే మణిపూర్‌ అంశంపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. వెల్‌ లోకి దూసుకెళ్లి నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సభలో ప్రకటన చేస్తారని స్పీకర్‌ ఓం బిర్లా ఎంత చెప్పినా విపక్షాలు వినిపించుకోలేదు. ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో లోక్‌ సభ ను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్‌ ప్రకటించారు.అటు రాజ్యసభ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మణిపూర్‌ హింస, తాజా అంశాలపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. అన్ని కార్యకలాపాలనూ పక్కనపెట్టి.. మణిపూర్‌ అంశంపై మాత్రమే సుదీర్ఘంగా చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశాయి. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొనడంతో.. సభను మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ ఖడ్‌ ప్రకటించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు